Rana: దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం ఈయన సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న రానా 2020వ సంవత్సరంలో మిహికా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. రానా దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు అయితే వీరి వైవాహిక జీవితం గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

 

మిహికా రానా ఇద్దరు కూడా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని, వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా విరి విడాకుల గురించి ప్రతిసారి వార్తలు వచ్చినప్పుడల్లా వాటిని ఖండిస్తూ ఉన్నారు. అయితే వీరికి వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించలేదు అయితే మిహికాకు కొన్ని సమస్యలు ఉండటం వల్ల పిల్లలు కలగడం లేదని వార్తలు వినపడుతున్నాయి కానీ వీరిద్దరూ మరికొంత కాలం పాటు పిల్లలను వద్దనుకున్నారని తెలుస్తుంది.

Rana:పిల్లలను దత్తత తీసుకోవడం…

తాజాగా వీరి పిల్లల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రానా దంపతులు పిల్లల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారట. తాము పిల్లలని కనకుండా

అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట వీరి నిర్ణయం తెలిసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.దగ్గుబాటి వారసులు లేకుండా అనాధ పిల్లలను తమ వారసులుగా ప్రకటించడం ఏంటి అని కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే రానా దంపతులు స్పందించాల్సి ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on మే 7, 2023 at 11:42 ఉద.