Ranaa: దగ్గుబాటి రానా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇకపోతే విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
విరాటపర్వం ట్రైలర్ 5వ తేదీ విడుదల కాబోతుందని శుక్రవారం ఉదయం పోస్టర్ తో సహా సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చర్చలకు కారణమైంది. ఈ పోస్టర్ లో రానా తన ఫేస్ కనపడకుండా హీరోయిన్ సాయి పల్లవి ని హత్తుకున్నట్లు మేకర్స్ డిజైన్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజనులు ఈ ఫోటోపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందిస్తూ సొంత బ్యానర్ లో కూడా మొహం చూపించుకోలేకపోతున్నారు. తక్కువ నిడివి గల పాత్రలు చేయడం అందరి చేత అవమానాలు పడటం రానా స్టైల్ అంటూ కామెంట్ చేశారు.

Ranaa: అలాంటి అవకాశం సొంత బ్యానర్ లోనే ఉంటుంది…
ఇలా నెటిజన్ విరాటపర్వం పోస్టర్ గురించి రానా పాత్ర పై ఇలాంటి కామెంట్ చేయడంతో ఈ కామెంట్ పై రానా స్పందించారు. ఈ సందర్భంగా రానా సమాధానం చెబుతూ.. మనం తగ్గి హీరోయిన్ పాత్రను గొప్పగా ఎలివేట్ చేయడంలో ఉన్న కిక్కే వేరు బ్రదర్.. కేవలం సొంత బ్యానర్ లో మాత్రమే ఇలాంటి గొప్ప పనులు చేయడానికి వీలు ఉంటుంది అంటూ రిప్లై ఇచ్చారు.ఈ విధంగా ఆ నెటిజన్ కామెంట్ కు రానా దిమ్మ తిరిగే సమాధానం చెప్పడంతో ఆయన సమాధానం పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరో సొంత బ్యానర్లో సినిమా చేస్తూ తన పాత్ర తగ్గించుకుని హీరోయిన్ పాత్రను ఎలివేట్ చేయడం అంటే ఎంతో గొప్ప విషయం అని అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.