Ranbir Kapoor -Aliya Bhatt: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణబీర్ కపూర్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ గత ఏడాది పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ దంపతులకు రాహా అనే కుమార్తె కూడా ఉంది. ఇలా పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో హడావిడిగా పెళ్లి చేసుకున్నారు ఇలా పెళ్లయిన కొన్ని నెలలకే బిడ్డకు జన్మనిచ్చారు.
ఇక ఈ విషయాన్ని అలియా భట్ స్వయంగా వెల్లడించారు. ఇక తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జంట అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించారు. పెళ్లి జరిగిన ఏడాదికే ఈ జంట ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అభిమానులు అసలు ఊహించలేదు. ఇలా వీరి నిర్ణయంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ వీరిద్దరూ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే..
Ranbir Kapoor -Aliya Bhatt: సినిమాలకు బ్రేక్…
అలియా భట్ రణబీర్ దంపతులు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆలియా ఇంటికి పరిమితం కాగా రణబీర్ వరుస సినిమాలలో నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ గల కారణంగా తన కుమార్తెతో కలిసి సమయం గడపడానికి వీలు లేకుండా పోతుందట ఈ క్రమంలోనే తన కుమార్తెతో కాస్త సమయం స్పెండ్ చేయడం కోసం రణబీర్ కపూర్ కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.ఇలా తన కుమార్తెతో ఈ విలువైన సమయాన్ని గడపడం కోసం రణబీర్ ఆలియా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఇలా ఈ జంట ఈ నిర్ణయం తీసుకోవడంతోనే కొత్త సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదని తెలుస్తోంది.