Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ చెప్పులు మోసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా శుక్రవారం మరణించింది. ఈ క్రమంలో ఆదిత్య చోప్రా కుటుంబీకులను పరామర్శించడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా శుక్రవారం సాయంత్రం ఆదిత్య చోప్రా ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు రణబీర్ ని ట్రోల్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఆలియా, రణబీర్ ఇద్దరూ కూడా క్యాజువల్ లుక్ లో కనిపించారు. ఆదిత్య చోప్రా ఇంటికీ చేరుకున్న వీరు ఒకరి వెనుక ఒకరు ఇంట్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఆలియా భట్ మొదటగా ఇంటి బయటకి ప్రవేశించగా వెనకే వెళుతున్న రణబీర్ కపూర్ ఆమె చెప్పులు తీసి చేతిలో పట్టుకొని లోపల పెడతాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే రణబీర్ చేసిన పనికి కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేయగా… మరికొంత మంది మాత్రం భార్య పై ఎంత ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆలియా కూతురి బాగోగులు చూసుకుంటూ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Ranbir Kapoor: వరుస సినిమాలతో బిజీగా రణబీర్…
అయితే రణబీర్ మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా రణబీర్, ఆలియా భట్ గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న తర్వాత గతేడాది పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. వివాహం జరిగిన కొంతకాలానికి ఈ క్యూట్ కపుల్స్ ఇద్దరు కూడా వారు తల్లితండ్రులు కాబోతున్నట్లు శుభవార్త తెలియజేశారు. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కూతురి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటుంది.