Ranbir Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత మంచి పేరు సంపాదించుకున్న రణబీర్ కపూర్ బాలీవుడ్ నటి అలియా భట్ ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఏప్రిల్ 14వ తేదీ గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఇక ఈమె వివాహం జరిగిన నెలకే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడంతో ఈమె పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అంటూ భారీగా ట్రోల్స్ వచ్చాయి. పెళ్లయిన ఏడు నెలలకే ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించారు.
ప్రస్తుతం అలియా భట్ తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉండగా రణబీర్ కపూర్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కు దగ్గర అవుతున్నారని ఓ వార్త బీ టౌన్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న అలియా ఇంటిపట్టునే ఉండడంతో రణబీర్ మాత్రం తన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చట్టా పట్టాలేసుకొని తిరగడమే కాకుండా సినిమా పనులంటూ తనతోనే గడుపుతున్నారని వార్త వైరల్ గా మారింది.
Ranbir Kapoor: ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోలేకపోతున్న హీరో…
ఇలా తన భర్త తన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతున్నారని విషయం అలియా భట్ వరకు చేరిన ఆమె ఈ విషయంలో పెద్దగా రియాక్ట్ అవ్వలేదని తెలుస్తోంది. అయితే రణబీర్ పెళ్లికి ముందే ఎంతో మంది హీరోయిన్లతో రిలేషన్ లో ఉంటూ బ్రేకప్ చెప్పుకున్న సంఘటనలు మనకు తెలిసిందే. ఇక చివరికి ఈయన అలియాతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు.ఇలా తనకు పెళ్లి జరిగినప్పటికీ ఈయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని మర్చిపోలేకపోతున్నారని ఈ క్రమంలోనే తన మాజీ ప్రేయసితో సినిమాలో నటించే అవకాశం రావడంతో ఇదే అవకాశంగా భావించిన రణబీర్ తనతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.