Rashi Khanna ఆ సినిమా దెబ్బకి ఈ హీరోయిన్ ఏకంగా సినిమా ఇండస్ట్రీ విడిచి పెట్టి వెళ్లి పోతోందట…

Joythi R

Rashi Khanna : వచ్చీ రావడం తోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని కెరియర్ ప్రారంభించి మంచి ఫేమ్ మరియు క్రేజ్ వచ్చిన తర్వాత ఇతర సినీ పరిశ్రమకు వెళ్లి సెటిల్ అయినటువంటి హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి వెలుగొందిన శ్రీదేవి, ప్రస్తుత స్టార్ హీరోయిన్ దిశా పటాని, అంజలి, అజిత్ ఇలా చాలా మంది ఇతర సినీ పరిశ్రమలలో బాగానే రాణిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ మరో స్టార్ హీరోయిన్ టాలీవుడ్ ను వదిలి పెట్టి బాలీవుడ్ లో సెటిల్ కావాలని సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది పంజాబీ బ్యూటీ రాశి ఖన్నా. అయితే ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుసగా స్టార్ హీరోలతో ఆఫర్లు దక్కించుకుని బాగానే రాణించింది. ఈ క్రమంలో ఆ మధ్య ఈ అమ్మడు తెలుగు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాశి ఖన్నా ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో ఈ మధ్య ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. కానీ అప్పటికే టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంలో నటించడానికి కమిట్ అవ్వడంతో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు మళ్లీ కొత్త తెలుగు చిత్రాలలో నటించడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో రాశి ఖన్నా కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని అందువల్లనే తెలుగు చిత్రాలలో నటించడానికి ఇష్టపడటం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి రాశి కన్నా తెలుగులో పక్కా కమర్షియల్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే ప్రకటించారు. పక్కా కమర్షియల్ ఈ చిత్ర షూటింగ్ పూర్తవడంతో ఈ అమ్మడు హిందీ, తమిళం భాషలలో కలిపి దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పింది. ఇందులో ఇప్పటికే మూడు చిత్రాలు షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. మరో రెండు చిత్రాలు ముంబై నగర పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -