Rashmi Gautam: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో అద్భుతమైన రేటింగ్స్ కైవసం చేసుకుని విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం మొదట్లో కేవలం సింగిల్ షోగా ప్రసారమయ్యేది. అయితే తరువాత కొద్ది రోజులకు ఎక్స్ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ వ్యవహరించగా, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరించారు.ఇలా గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చింది.
అయితే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు. నాగబాబు తర్వాత వరుసగా ఈ కార్యక్రమం నుంచి ఒక్కొక్క కమెడియన్ బయటకు వెళ్లిపోయారు.ఈ విధంగా ఎంతో మంచి గుర్తింపు ఉన్న వారందరూ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ అమాంతం పడిపోయాయి.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ సైతం పరోక్షంగా తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేస్తున్నానని వెల్లడించారు. ఇలాజబర్దస్త్ కార్యక్రమానికి గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటానని పరోక్షంగా వెల్లడించడంతో ఇక జబర్దస్త్ కార్యక్రమానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని అందరూ భావించారు.

Rashmi Gautam: లక్షల్లో పారితోషకం తీసుకుంటున్న రష్మి..
ఇలా ఒక్కొక్కరిగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడంతో ఇక మిగిలింది రష్మీనే అని రశ్మి కూడా అనసూయ బాటలోనే బయటకు వెళ్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే రష్మీ ఇప్పుడే జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి బయటకు వెళ్ళదని తెలుస్తోంది. రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడం కోసం రష్మీకి లక్షల్లోనే పారితోషకం ఇస్తున్నారని అందుకే తాను ఈ కార్యక్రమం వదిలి ఇప్పుడే బయటకు వచ్చేలా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ విధంగా ఒక్కో ఎపిసోడ్నకి లక్షలలో పారితోషికమే తనని ఇప్పటికి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో ఉండేలా చేస్తుందని చెప్పాలి.