Rashmi Gautham: రష్మీ గౌతమ్ పరిచయం అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ సందడి చేసిన ఈమె పెద్దగా వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది దీంతో బుల్లితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది.ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిందని చెప్పాలి. మొదట్లో జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈమె ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ రావడంతో ఈ కార్యక్రమాన్ని ఎక్స్ ట్రా జబర్దస్త్ గా కూడా ప్రసారం చేస్తూ వచ్చారు. ఇక రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక జబర్దస్త్ కార్యక్రమం అంటేనే ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ ఎప్పుడు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు పదాలతో రెచ్చిపోయి మాట్లాడుతూ స్కిట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఈ కార్యక్రమం పట్ల కాస్త నెగిటివ్ కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్న విధంగా బూతు డైలాగులతో రెచ్చిపోయి సందడి చేస్తుంటారు.ఇక కొన్నిసార్లు స్కిట్ మధ్యలో యాంకర్లు కూడా ఇలాంటి బోల్డ్ డైలాగ్స్ కామెంట్స్ వాడుతూ ఉంటారు.
Rashmi Gautham: బోల్డ్ కామెంట్స్ చేసిన బోల్డ్ యాంకర్…
ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రష్మి ఏకంగా మంచం పిల్లలు అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఈ ప్రోమోలో భాగంగా ఒక భార్యాభర్తల స్కిట్ లో భాగంగా ఇలా భార్యాభర్తలు కంచం దగ్గర కూర్చుంటే పిల్లల పుట్టరు అనే డైలాగ్ చెబుతున్నారు. ఇంతలోనే రష్మీ ఈ డైలాగ్ అందుకొని పిల్లలు పుట్టాలంటే మంచం దగ్గర ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్ చేశారు.రష్మీ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడం సబబు కాదు అంటూ మల్లెమాల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.