Rashmika: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుని నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా లెవెల్ లోకి హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వరుస క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో రష్మిక షేర్ చేసే ఫోటోలు, వీడియోల వల్ల విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. రష్మిక చేసే ఫోటో షూట్లు, అప్పుడప్పుడు ఆమె చేసే పిల్ల చేష్టలు వల్ల తరచూ ట్రోల్ చేస్తూ ఉంటారు. రష్మిక చేసే పనులు కొందరికీ క్యూట్‌గా అనిపిస్తాయి.. మరి కొందరికి చిరాకు పుట్టించేలా ఉంటాయి. అలా రష్మిక మీద ట్రోలింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ.. తాను ఎలా ఉండాలో చెప్పండంటూ ట్రోలర్లకు కౌంటర్లు వేసింది.
చాలా చిరాగ్గా అనిపిస్తుంది…
ఇక తాజాగా మరొక్కసారి రష్మిక మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా రష్మిక మందాన్న ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసింది.
Rashmika:
ఈ క్రమంలో వారసుడు, ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటలకు స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో ఆమె డ్యాన్సులు, ఆమె వేసిన కాస్ట్యూమ్స్ పట్ల జనాలు ట్రోలింగ్ చేస్తు నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. నిన్ను చూస్తుంటే చిరాగ్గా ఉంది. రికార్డింగ్ డ్యాన్సులు వేసేదానిలా ఉందంటూ నానా రకాలుగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటి పై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.