Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. చలో సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. ఇక గతంలో విడుదలైన పుష్ప సినిమా ద్వారా రష్మిక క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగిపోయింది. ఈ సినిమా విజయంతో ఈ ఎమ్మటికి బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు అందుతున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా రష్మిక సినిమాల వల్ల ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ మేరకు తాజాగా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా రష్మిక.. సోఫాలో కూర్చొని రెండు చేతులతో నోరు మూసుకుని నవ్వుతున్న తన ఫోటోని షేర్ చేస్తూ.. `సాధారణంగా కొన్ని విషయాలకు నా స్పందన ఇదే`అని రాస్తూ..నోరు మూసుకున్న ఎమోజీని, స్మైల్‌ని, లవ్ ఎమోజీలను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతుండగా… అయితే రష్మిక మందన్నా ఈ ఫోటో, క్యాప్షన్ దేన్ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది.
Rashmika: నోరు మూసుకోవడం మంచిది…
ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక- విజయ్ దేవరకొండ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తరచూ వీరిద్దరూ జంటగా లొకేషన్స్ ఎంజాయ్ చేయటం,ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటికి రావటంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఇటు రష్మిక అటు విజయ్ ఎప్పుడు స్పందించలేదు. అలాగని ఈ వార్తలను ఇద్దరూ గట్టిగా ఖండించలేదు. అందువల్ల వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ మైంటైన్ చేస్తున్నారంటూ ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.