Rashmika: రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టితో పెట్టుకున్న వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనకు తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయని సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటి సాంగ్స్ ఉండవంటూ సౌత్ సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్మిక నోటి దూల కారణంగా తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఈమె ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు అందరిని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తే చాలు రెమ్యూనరేషన్ తరువాత అని ఎదురుచూసే హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి హీరోల సరసన అవకాశాల కోసం ఎంతోమంది బాలీవుడ్ భామలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి అవకాశం రష్మికకు వచ్చినా కూడా ఈమె చేతులారా ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారు.
భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన రష్మిక….
Rashmika:
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఎంపిక గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మొదటగా రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేశారట.అయితే ఈ సినిమాలో నటించడం కోసం రష్మిక ఏకంగా ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. నిర్మాతలు సైతం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.. అందుకే నిర్మాతలు సైతం ఈమెను హోల్డ్ లో పెట్టారని తెలుస్తుంది. అయితే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి రష్మిక ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నారని, రష్మిక తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా పిచ్చి నిర్ణయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ పక్కన అవకాశం వస్తే చాలని ఎదురుచూసే ఎంతోమంది హీరోయిన్లు ఉండగా, రష్మిక మాత్రం చేతులారా ఈ ఆఫర్ ని వదులుకున్నారని తెలుస్తోంది.