Rashmika: ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రియల్ హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగులో వరస హిట్లు అందుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం నార్త్ లో కూడా తన సత్తా నిరూపించుకోవడానికి ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తుంది. గత యేడాది విడుదలైన పుష్ప సినిమా ద్వారా రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఈ క్రమంలో తన సినీ జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అమ్మడు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన పని వాళ్ళ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..” మన మాటలకు నిజంగా చాలా శక్తి ఉంది. ఒక మనిషి మనసు విరి చేయడానికి ఒక్క మాట చాలు. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి .అలాగే నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చిన్న సంఘటనను కూడా డైరీలో రాసుకుంటాను అంటూ తెలిపింది.
Rashmika: సాటి మనుషులను గౌరవిస్తాను…
అలాగే షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చాక గౌరవంతో ప్రతి ఒక్కరి పాదాలను తాకి నమస్కరిస్తానని, తన ఇంట్లో పని చేసే పని వాళ్లకు ప్రతిరోజు ఇంటికి రాగానే కాళ్లు మొక్కుతానని రష్మిక చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఒక మనిషిగా సాటి మనుషులను గౌరవించడమే తనకు తెలుసునని, అందుకే ప్రతిరోజు తన ఇంట్లో పని వాళ్లకు కూడా కాళ్లకు నమస్కరిస్తాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తు కామెంట్స్ చేస్తున్నారు.