Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే వీరి ప్రేమ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదని ఏదో ఒక రోజు వీర ప్రేమ విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇస్తారంటూ కూడా వీరి గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ విధంగా విజయ్ దేవరకొండ రష్మిక గురించి తరచూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో రష్మిక తన మనసులో ఒకరు ఉన్నారని ఆల్రెడీ తనతో నాకు పెళ్లి జరిగింది అంటూ ఒక బాంబు బ్లాస్ట్ చేశారు.మరి రష్మిక మనసులో ఉన్నది ఎవరు? ఆమెకు ఎవరితో పెళ్లి జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే తాజాగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా హోస్ట్ తనని ప్రశ్నించడంతో ఈమె తనకు పెళ్లి జరిగిపోయింది అంటూ కామెంట్ చేశారు.
Rashmika: నరుటోతో పెళ్లి జరిగింది…
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తనకు నరుటోతో ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందని తెలిపారు. నా మనసులో అతనే ఉన్నారు అంటూ ఈమె ఫన్నీ కామెంట్ చేశారు. మరి నరుటో ఎవరు అనే విషయానికి వస్తే…నరుటో అనేది ఫేమస్ ఎనిమీ సిరీస్ లో ఓ పాత్ర పేరు.వీరికి ఎంతోమంది ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులలో రష్మిక కూడా ఒకరని తెలిసిపోయింది. ఇలా ఈమె తన మనసులో ఒకరు ఉన్నారని వారితో నా పెళ్లి జరిగిపోయిందంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషానికి వస్తే ఈమె ప్రస్తుతం పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.