Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ సాధించినటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ఈమె ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి రష్మిక ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా సినిమాలతోఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక విషయాన్ని తెలియజేస్తూ ఇండియాలో ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న మొదటి వ్యక్తి తానే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రష్మిక బ్రాండింగ్ చేయడం కొత్తేమి కాదు. ఆల్రెడీ బ్యూటీ ప్రోడక్ట్స్ కి, ట్రావెల్ ఏజెన్సీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
Rashmika: మొదటి వ్యక్తి నేనే కావడం సంతోషంగా ఉంది…
ఈ క్రమంలో కొత్త జపనీస్ బ్రాండ్ గురించి పోస్ట్ చేస్తూ.. “నేను మరో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి నేను బ్రాండ్ అడ్వొకేట్ గా వ్యవహరించనున్నాను. ఇండియా నుండి ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి నేనే అని ఈ విషయాన్ని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇలా జపనీస్ బ్రాండ్ కు ఇండియన్ యాక్ట్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇలా రష్మికకు ఇంత మంచి గౌరవం లభించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.