Rashmika Mandanna: ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. గీత గోవిందం సినిమాతో ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆ సినిమా ఆమెని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసిందని చెప్పాలి. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ నటులతో జోడి కట్టింది. ఇక పుష్ప సినిమా ద్వారా నేషనల్ వైడ్ హీరోయిన్ గా మారి నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది.
పుష్ప 2 సినిమా ద్వారా మళ్లీ మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈరోజు నేషనల్ క్రష్ రష్మిక బర్త్డే. ఏప్రిల్ 5న.. 28వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ భామకి పుష్ప 2 టీమ్ మెంబర్స్ అందరూ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకి సినిమా అవకాశాలు అందాల పోటీలో గెలవడం ద్వారా వచ్చిందని తెలిపింది.
మొదటిసారిగా ఆమెకి డైరెక్టర్ ఫోన్ చేసినప్పుడు ఎవరో ఫ్రాంక్ చేస్తున్నారేమో అనుకొని నాకు సినిమాల మీద ఆసక్తి లేదు ఫోన్ పెట్టేయండి అనటమే కాకుండా ఆ నెంబర్ ను కూడా బ్లాక్ చేసినట్లు చెప్పుకొచ్చింది రష్మిక. ఆ తరువాత దర్శక నిర్మాతలు నానా ఇబ్బందులు పడి ఆఖరికి తన క్లాస్ టీచర్ ద్వారా తనని అప్రోచ్ అయ్యారట. అప్పుడు కూడా తనకి నటించడం తెలియదని చెప్పిందట ఈ భామ.
Rashmika Mandanna:
2014లో రష్మిక మోడలింగ్ ప్రారంభించి కిర్రాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకొని సైమా అవార్డు కూడా గెలుచుకుంది. కాగా ఈమె వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కి జోడిగా కనిపించబోతుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు.