Rashmika Mandanna మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న…. అఫీషయల్ అనౌన్స్ మెంట్…

Joythi R

Rashmika Mandanna తెలుగులో ప్రస్తుతం కన్నడ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. దీంతో ఈ బ్యూటీకి రోజురోజుకీ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అంతేకాకుండా టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అంటూ ఇతర సినిమా పరిశ్రమ నుంచి కూడా వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం అరడజను పైగా చిత్రాలు ఉన్నాయి.

కాగా తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో మరో బంపరాఫర్ దక్కించుకుంది. అయితే తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఎనిమల్ అనే చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. దీంతో తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపాడు. ఇందులో భాగంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రష్మిక మందన్న ని ఎనిమల్ చిత్ర టీమ్ లోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. అలాగే రష్మిక మందన్న ఈ చిత్రంలో గీతాంజలి అనే పాత్రలో నటిస్తుందని తెలిపాడు. అయితే అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత సందీప్ రెడ్డి వంగా ఎక్కువగా బాలీవుడ్ సినీ పరిశ్రమపై దృష్టి సాధించాడు. ఇందులో భాగంగా రణబీర్ కపూర్ తో ఎనిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Rashmika Mandanna మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న.... అఫీషయల్ అనౌన్స్ మెంట్...
Rashmika Mandanna మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న…. అఫీషయల్ అనౌన్స్ మెంట్…

అయితే రష్మిక మందన్న ఇప్పటికే బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి. దీంతో ఈ షూటింగ్ పనులు పూర్తవగానే ఎనిమల్ చిత్రం షూటింగులో పాల్గొంటుంది. మరోవైపు ఈ అమ్మడు తెలుగులో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప పార్ట్ 2 లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేసవి తరువాత పూర్తయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -