Rashmika: రష్మి గౌతమ్ బుల్లితెర యాంకర్ గా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు వెండితెర సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలు అలాగే వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ఇలా సినిమాలో బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే అందరూ కూడా వారి స్కిట్ల ద్వారా అందరిని సందడి చేశారు.
సీనియర్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ మాత్రం రష్మీ పట్ల వేసినటువంటి ఒక డబ్బులు మీనింగ్ డైలాగ్స్ అందరిని కాస్త అసహనానికి గురిచేస్తుంది. ఈ సందర్భంగా ఆటో రాంప్రసాద్ తన స్కిట్ లో భాగంగా రష్మితో మాట్లాడుతూ ఈరోజు రాత్రికి రమ్మంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వేశారు.ఇలా రష్మితో ఈయన ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడమే కాకుండా తెగ సిగ్గుపడుతూ కనిపించారు. దీంతో రష్మీ నేనెందుకు రాత్రికి రావాలి అని అడగడంతో రాత్రికి ఎందుకు వస్తారో తెలియదా అంటూ ప్రసాద్ సిగ్గు పడిపోయారు.
Rashmika: మీరు మారరా…
ఈ విధంగా రష్మీ పట్ల ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఆటో రాంప్రసాద్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే అక్కడే ఉన్నటువంటి జడ్జి ఇంద్రజ ఒక్కసారిగా ఏయ్ అంటూ గట్టిగా అరవడంతో ఉలిక్కిపడిన ఆటో రాంప్రసాద్ అదే మా ఊర్లో జాతర జరుగుతుంది అందుకే రాత్రికి రమ్మంటున్నాను అంటూ ఆటో రాంప్రసాద్ కవర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మల్లెమాలవారు షో రేటింగ్స్ కోసం ఎలాంటి దారుణాలకైనా పాల్పడతారు. మీరు మాత్రం ఎప్పటికీ మారరు అంటూ పలువురు ఈ ప్రోమో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.