Rashmika: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ దేవరకొండతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ విజయ్ దేవరకొండతో నటించిన ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా రష్మిక ఇలాంటి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ భరత్ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ అనే సినిమా ద్వారా వీరిద్దరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా ఈ జంటకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడ్డారు.
Rashmika: నాలుగేళ్లు పూర్తి చేసుకున్న డియర్ కామ్రేడ్…
ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చినవి డియర్ కామ్రేడ్ సినిమా విడుదల అయ్యి జూలై 26వ తేదీకి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం నాకు ఎప్పటికీ ప్రత్యేకము అంటూ ఈమె డైరెక్టర్ భరత్ విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.