Rashmika: నటి రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా వచ్చారు. ఇలా వరుస భాషలలో సినిమా అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే రష్మిక 2016వ సంవత్సరంలో కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు తన సినీ కెరీయర్ లో దాదాపు 15 సినిమాల వరకు నటించి సందడి చేసి ఉంటారు.
ఇక ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ ఉండడంతో ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. ఇలా ఏడాదికి రష్మిక సుమారు 8 కోట్లకు పైగా డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా సినిమాలు,యాడ్స్ ద్వారా రష్మిక భారీగానే సంపాదించిందని ఈమె ముందు స్టార్ కిడ్స్ కూడా ఏమాత్రం పనికిరారని తెలుస్తోంది. ఇలా 27 సంవత్సరాల వయసులోనే ఈ ముద్దుగుమ్మ ఏకంగా 65 కోట్లను రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తుంది.
Rashmika:65 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన రష్మిక…
ఈ విధంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి రష్మిక ముందు చూపుతోనే ఆస్తులను కూడా భారీగా కూడపెట్టారని తెలుస్తుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా నితిన్ సరసన కూడా మరొక సినిమాలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తాజాగా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా ప్రారంభించుకోనుంది.