Rashmika: ఏం మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత ఆ సినిమాతో మంచి హిట్ అందుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఇలా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకున్న సమంత కొత్త కాలానికి అతనికి దూరం అయింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ నుండి బయటపడటానికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక సమంత తాజాగా మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడిన సంగతి తానే ప్రకటించింది.
ఆమె అనారోగ్యం గురించి తెలియగానే ఎంతోమంది అభిమానులు ఆమె తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఎంతోమంది సెలబ్రెటీలు కూడా సమంత తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సమంత గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా నటించిన వరిసూ, మిషన్ మజ్నూ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక బాలీవుడ్ మీడియాతో ముచ్చటించి సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Rashm ika:సమంత ఎల్లప్పుడు నాకు స్ఫూర్తి…
ఈ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ… సినిమా విశేషాల గురించి అనేక విషయాలను వెల్లడించింది. ఇక ఈ సందర్భంగా సమంత గురించి మాట్లాడుతూ “సమంత తన అనారోగ్యం గురించి స్వయంగా ప్రకటించే వరకు తనకు ఆ విషయం తెలియదని ఈ సందర్భంగా రష్మిక చెప్పింది. సమంత ఎంతో దయ కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి అని, నేను ఎప్పుడూ తనని ఒక అమ్మ లాగా రక్షించుకోవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. సమంత తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పోరాడి నిలబడిన ఎంతో గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని అందరూ ఏ విధంగా గౌరవించి ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటారో, నేను కూడా అదే విధంగా ఆమెను స్ఫూర్తిగా భావిస్తాను. ఎల్లప్పుడూ ఆమెకు మంచి జరగాలని కోరుకుంటాను” అంటూ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.