Rashmika: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాకు మించి ఉండేలా ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి సన్నివేశాలు కానీ ఇతరత విషయాలు కానీ లీక్ కాకుండా చిత్ర బృందం ఎంతో పకడ్బందీగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొన్నిసార్లు సినిమా షూటింగ్ లోకేషన్ లో నుంచి కొన్ని ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో రష్మిక చనిపోతుందంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 లో రష్మిక చనిపోవడంతోనే సెకండ్ హీరోయిన్ ఎంపిక చేసుకోబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటో చర్చలకు కారణమైంది.
Rashmika: ఫోటోలో ఉన్నది రష్మికనే కాదు…
ఇక రష్మిక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు ఇది నిజం కాదని ఈ సినిమాలో రష్మిక పాత్ర చనిపోదంటూ కామెంట్లు చేస్తున్నారు నిజానికి ఆ ఫోటో రష్మికదే కాదని మరికొందరు ఈ ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి పేరు ఈషా దివేకర్. ఇది ఒక మరాఠీ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్ అని తెలుస్తోంది. సో ఇది పుష్ప 2 సినిమాకి సంబంధించిన క్లిప్పింగ్ కాదని ఇందులో రష్మిక చనిపోతుంది అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.