Ravi Teja : రూటు మార్చిన‌ ర‌వితేజ..ఈ కొత్త హీరోయిన్ గురించి తెలుసుకోవాల్సిందే..!

Ra One

Ravi Teja క్రాక్ సినిమా స‌క్సెస్‌తో య‌మ స్పీడుమీదున్నాడు ర‌వితేజ. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌క్కా వినోదాన్ని అందిస్తా..గెట్ రెడీ అంటున్నాడు. ఈ హీరో ప్ర‌స్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు చిత్రంలో న‌టిస్తున్నాడు. సినిమా అఫీషియ‌ల్ లాంఛింగ్ ప్రోగ్రాంను ఏప్రిల్ 2 ఉగాది (నేడు) ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు లాంఛ్ చేసే కంటే ముందే ర‌వితేజ టీం అదిరిపోయే అప్ డేట్స్ ఇస్తూ అంద‌రిలో జోష్ నింపుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ చెల్లెలు నుపుర్ స‌న‌న్ హీరోయిన్ గా ఫైన‌ల్ చేసింది టీం.

తాజాగా మ‌రో భామ‌ను సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసింది. ఇంత‌కీ ఆ భామ ఎవ‌రో దాదాపు ఎవ‌రికీ తెలుసుండ‌దు. ఎందుకంటే తెలుగులో తొలి సినిమా. ర‌వితేజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతుంది గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్‌. ఈ భామ‌లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. గాయ‌త్రి భ‌రద్వాజ్ మోడ‌ల్ మాత్ర‌మే మంచి సింగ‌ర్ కూడా. అంతేకాదు ఈ బ్యూటీ వృత్తిరీత్యా డాక్ట‌ర్ కూడా. గాయ‌త్రి భ‌రద్వాజ్ డెంటిస్ట్‌గా కూడా వ‌ర్క్‌చేస్తోంది. ఈ బ్యూటీ ఇప్ప‌టికే న‌టించిన డిండోరా వెబ్ సిరీస్ మంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

ర‌వితేజ ఇటీవ‌ల కాలంలో త‌న రూటు మార్చి కొత్త హీరోయిన్ల‌కు అవ‌కాశం ఇస్తున్నాడు. త‌న సినిమాల రెమ్యున‌రేష‌న్ పెంచుతూనే..త‌క్కువ పారితోషికంతో వ‌చ్చే హీరోయిన్ల వేట‌లో ప‌డ్డాడు ర‌వితేజ‌. బ‌డ్జెట్ పరంగా నిర్మాత‌ల‌కు స్టార్ హీరోయిన్ల‌యితే భారమ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో..ర‌వితేజ ఇలా కొత్త కొత్త భామ‌ల‌ను సిల్వ‌ర్ స్క్రీన్ కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. మొత్తానికి గాయత్రి భ‌రద్వాజ్‌కు టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమా బాగా క‌లిసి రావాల‌ని..రానున్న రోజుల్లో స్టార్ హీరోయిన్ గా మారిపోవాల‌ని అంద‌రూ విష్ చేస్తున్నారు. 1970ల‌లో స్టూవ‌ర్ట్ పురంలో పేరు గాంచిన అత్యంత ధైర్య‌వంతుడైన పాపుల‌ర్ దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు బ‌యోపిక్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

- Advertisement -