Ravi Teja తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా నిలదొక్కుకున్న ప్రముఖ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే రవితేజ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఆ తర్వాత క్రమక్రమంగా సెకండ్ హీరో, మెయిన్ హీరో పాత్రలలో నటించి ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు రవితేజ అనుభవిస్తున్న ఈ స్టార్డమ్ అంత సులభంగా రాలేదు. గతంలో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన తర్వాతే ఈ హోదా దక్కింది.
అయితే తాజాగా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించిన అశ్విని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా హీరో రవితేజ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. హీరో రవితేజ కి తనతో ఇంతకుముందు ఎలాంటి పరిచయం లేదని కానీ మొదటిసారి రవితేజ తో మాట్లాడినపుడు ఎంతో గౌరవ మర్యాదలతో ప్రవర్తిచడాని చెప్పుకొచ్చింది. అలాగే రవితేజ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన తనతో చెప్పాడని ఆ సంఘటన వినగానే రవితేజ మీద గౌరవం మరింత పెరిగిందని తెలిపింది.
రవితేజ చెన్నైలో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రోజుకి కేవలం పది రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళట. ఈ పది రూపాయలతో రోజులోనే ఫుడ్, బెడ్ మొత్తం మేనేజ్ చేసుకునేవాడని, ఈ క్రమంలో డబ్బులు సరిపోక కొన్ని రోజుల పాటు మధ్యాహ్న భోజనం కూడా తినటం మనేసాడట. కానీ అన్నీ కష్టాలను తట్టుకుని నిలబడి ఇవ్వాళ ఇండస్ట్రీ లో మంచి హోదాలో ఉన్నాడని నిజంగా అలాంటి హీరో తో నటించినందుకు గర్వంగా ఉందని తెలిపింది.