Ravinder – Mahalaxmi: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్, సీరియల్ నటి మహాలక్ష్మి. గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే నిర్మాత రవీందర్ ఎలా ఉంటాడో రూపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పైగా అంత అందంగా ఉన్న మహాలక్ష్మి కూడా ఆయనను పెళ్లి చేసుకోవడంతో ఆమె ఆయన దగ్గరున్న డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని బాగా పుకార్లు కూడా వచ్చాయి.
పైగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. గతంలో వీళ్ళకు పెళ్లిళ్లు జరుగగా కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల వాళ్లతో విడిపోయి ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కొంతకాలం ప్రేమలో ఉండగా తమ కుటుంబ సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి వీరిపై బాగా ట్రోలింగ్స్ కూడా ఎదురయ్యాయి. మహాలక్ష్మి రవీందర్ ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని బాగా విమర్శలు కూడా చేశారు.
అయినా కూడా ఈ జంట ఆ విమర్శలను పట్టించుకోకుండా తమ జీవితమేంటో తాము కొనసాగిస్తున్నారు. హనీమూన్ లంటూ తిరిగి బాగా ఎంజాయ్ చేశారు. పలు ఇంటర్వ్యూలో పాల్గొని తమ వ్యక్తిగత విషయాలు బయట పెట్టారు. అంతేకాకుండా తము ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటారు.
Ravinder – Mahalaxmi:
అయితే తాజాగా మహాలక్ష్మి తన బెడ్ రూమ్ ఫోటో ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో తాను సోఫాలో కూర్చుని ఉండగా.. నైట్ డ్రెస్‌లో కనిపించింది. తన భర్తతో కలిసి నైట్ డ్రెస్‌లలో ఫోటోలతో ఆకట్టుకున్నారు. ఆ ఫోటోలను చూసి తమ అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని మాత్రం.. మీరిద్దరూ బిడ్డకు ఎప్పుడు జన్మనిస్తారు. శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్ పెట్టగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.