Raviteja: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో లైన్లో పెడుతున్న రవితేజ ఇటీవల ధమాకా సినిమా ద్వారా సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ ఏడవ తేది సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో నిర్వహించిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ గోపీచంద్ మలినేని గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు గోపీచంద్ మాట్లాడుతూ..” ఈ రోజున నాలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండటానికి కారణం రవితేజనే. ఆయనతో పనిచేయడం అంటే ఎనర్జీ డ్రింక్ తాగినట్టే అని అన్నాడు. రవితేజతో చేసిన మూడు సినిమాలు దర్శకుడుగా నన్ను ఒక్కో మెట్టు పైకి ఎదిగేలా చేశాయి. ఆకారంలో నేను ఆయనలా ఉండటం వల్ల మేమిద్దరం అన్నదమ్ములుగా అందరూ భావిస్తారు. నిజంగానే నేను ఆయనకి తమ్ముడులాంటి వాడిని అంటూ చెప్పుకొచ్చాడు.
Raviteja: ఆ ఎనర్జీని అందుకోలేం…
‘ డాన్ శీను’ సినిమా ద్వారా దర్శకుడుగా నా కెరియర్ ప్రారంభం అయింది. ఆ సినిమాకి గెస్టుగా రాజమౌళిని ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు రాజమౌళి రవితేజ గురించి నన్ను హెచ్చరించారు. రాజమౌళి గారిని కలిసి రవితేజతో సినిమా తీస్తున్నట్లు చెప్పగానే.. రవితేజ నుంచి ఒక వేరియేషన్ ను అడిగితే నాలుగు వేరియేషన్లు చేసి చూపిస్తాడు. ఆ ఏనర్జీని మనం అందుకోవడానికి చాలా కష్టపడాలి అని రాజమౌళి చెప్పాడు. అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఆ తరువాత రవితేజతో కలిసి పని చేసినప్పుడు తనకు అనుభవంలోకి వచ్చాయని గోపిచంద్ మలినేని చెప్పాడు.