Raviteja Son: పవన్ కొడుకంటే ముందే రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గత నాలుగైదేళ్ళుగా మెగా ఫ్యామిలీ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు
వస్తున్నాయి. కానీ, ఇంకా దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను స్టార్ డైరెక్టర్‌కు మెగా ఫ్యామిలీ అప్పగించబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఆ రేస్‌లో పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కొరటాల శివ, హరీశ్ శంకర్ లాంటి వారున్నారు. ఇక అకీరా కోసం మెగాస్టార్ స్వయంగా కథ విని ఫైనల్ చేసే
బాధ్యత భుజాన వేసుకున్నారని అంటున్నారు. మెగా హీరోలలో ఎవరు సినిమా చేసినా కూడా చిరు కథ విని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మిగతా పనులన్నీ మొదలవుతాయనడంలో సందేహం లేదు. అయితే, ఈ ఏడాది జూనియర్ పవర్ స్టార్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ, మాస్ మహారాజ రవితేజ కొడుకు మాత్రం ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.
Raviteja Son: రవితేజ సొంతగా నిర్మాణ సంస్థలో..!
ఇప్పటికే, రవితేజ కొడుకు తండ్రి నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో చిన్నప్పటి హీరో పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ సినిమా దర్శకుడు అనీల్ రావిపూడి రవితేజ కొడుకు మైండ్‌లో పెట్టుకొని పక్కా మాస్ ఎంటర్టైనర్ను తీయాలని సాలీడ్ స్టోరీని రెడీ చేసి పెట్టాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం రవితేజ సొంతగా నిర్మాణ సంస్థను స్థాపించి తాను నటించే సినిమాలకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి మాస్ మహారాజ కొడుతో తీసే సినిమా సొంత నిర్మాణ సంస్థలోనా లేక బయట సంస్థలో ఉంటుందా చూడాలి.