Real Story ఇదెక్కడి మోసం మావా…. పాపం కన్నె పిల్ల పై మోజు పడ్డ అంకుల్.. కానీ పాప సాంతం నాకించేసింది గా…

Joythi R

Real Story ఈ మధ్యకాలంలో కొందరు లేనిపోని ఆశలకి పోయి ఆర్థిక మోసాలకు గురవుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా కొందరు వయసు మళ్ళిన వాళ్ళు కూడా వయస్సు లో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని దురాశతో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అయితే 50 ఏళ్ల వయసు పైబడినటువంటి ఓ వ్యక్తి అప్పుడప్పుడే యవ్వనం లోకి వచ్చిన ఓ యువతి పై మోజుపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో లక్షల రూపాయలు పెట్టి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చి యువతిని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. కానీ చివర్లో ఆ యువతి ఇచ్చిన ట్విస్ట్ కి ముసలోడు కాస్త అవాక్కయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాలకు వెళ్తే సుబ్బారావు (పేరు మార్చాం) అనే వ్యక్తి హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే కొన్నేళ్ల క్రితం పలు అనారోగ్య సమస్యల కారణంగా సుబ్బారావు భార్య కాలం చేసింది. దీంతో అప్పటి నుంచి సుబ్బారావు ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో సుబ్బారావు కి రెండో పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. దీంతో ఇంకేముంది మాట్రిమోనియల్ సైట్లను సంప్రదించి తగిన జోడీ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ అందమైన యువతి తనకి తానుగా సుబ్బారావు తో చాటింగ్ చేస్తూ మాట్లాడింది. ఇందులో భాగంగా సుబ్బారావు తో నాలుగు అందమైన మాటలు మాట్లాడుతూ క్రీం బిస్కెట్ వేసింది. దీంతో సుబ్బారావు కూడా పాపం ఆ పిల్ల తనపై మోజుగా ఉందని భ్రమలో పడిపోయాడు.

దాంతో ఆ యువతి పని మరింత సులువైంది. సుబ్బారావు ఎప్పుడయితే నమ్మటం మొదలు పెట్టాడో అప్పుడే అసలు కథ మొదలైంది. ఈ క్రమంలో మనం పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉందామని అలాగే చదువుని పూర్తి చేసుకుని ఉద్యోగం చేసి మన ఫ్యామిలీని బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. అప్పటి నుంచి దాదాపు నలభై ఆరు లక్షల రూపాయలకు పైగా డబ్బు గుంజింది. కానీ సుబ్బారావుకి అనుమానం మొదలైంది. దీంతో యువతి డబ్బు అడిగినప్పుడల్లా ఎందుకు కావాలి, దేని కోసం ఖర్చు పెడుతున్నావనే వివరాలు అడగటం మొదలు పెట్టాడు. యువతికి అనుమానం వచ్చి ఇక సుబ్బారావు ను కట్ చెయ్యాలని మెల్లగా మాట్లాడటం తగ్గించేసింది.

దీంతో సుబ్బారావు యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చి తన డబ్బు తమకు తిరిగివ్వాలని అడగటం మొదలు పెట్టాడు. ఇంకేముంది ఈ పాటికి మీకు విషయం అర్థం అయి ఉంటుంది యువతి ఫోన్ స్విచాఫ్ చేసింది. అలాగే మాట్రిమోనియల్ సంస్థ నుంచి తన ప్రొఫైల్ ని డిలీట్ చేసింది. ఆ తర్వాత సుబ్బారావు దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి చేశాడు.

- Advertisement -