Reema Sen తెలుగు, తమిళ అనువాద చిత్రాలలో నటించి ఒకప్పుడు ప్రేక్షకులు ఎంతగానో అలరించిన బ్యూటిఫుల్ హీరోయిన్ రీమాసేన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి రీమా సేన్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు నెగిటివ్ పాత్రలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది. కాగా నటి రీమాసేన్ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో నటించిన వల్లభ మరియు యుగానికొక్కడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ అమ్మడికి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందాయి.
కాగా రీమాసేన్ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి బాగానే అలరించినప్పటికీ పెళ్లి చేసుకున్న తర్వాత క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ తన భర్తకు వ్యాపారంలో సహాయం చేస్తోంది. అయితే నటి రీమాసేన్ వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది.
అయితే ప్రస్తుతం వేసవి కావడంతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి గోవాకి వెళ్ళింది. ఈ క్రమంలో తన సోదరితో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా 40 ఏళ్ల వయసు పైబడినా ఇప్పటికీ రీమా సేన్ కి అందం ఏమాత్రం తగ్గలేదని అలాగే ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేసిన మళ్లీ అవకాశాలు దక్కించుకుని బిజీ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయంలు ఇలా ఉండగా నటి రీమాసేన్ తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన చిత్రం అనే చిత్రం ద్వారా 2000వ సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. దాంతో రీమాసేన్ కి తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో సినిమా ఆఫర్లు బాగానే వరించాయి. దీంతో దాదాపుగా పది సంవత్సరాల పాటు రీమా వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా గడిపింది. కాగా చివరగా రీమాసేన్ 2012 సంవత్సరంలో తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్ గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ రెండు సీజన్లలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మడు సినిమాలో కనిపించలేదు.