Regina Cassandra మందు గ్లాస్ తో కనిపించిన సాయి తేజ్ హీరోయిన్… ఇంత బోల్డ్ గానా…?

Joythi R

Regina Cassandra ఈమధ్య కాలంలో కొందరు హీరో హీరోయిన్లు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో కూడా నటిస్తూ బాగానే ఆదాయం సంపాదిస్తున్నారు. దీనికితోడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువగా ఉండటంతో కొన్ని లిక్కర్ ఉత్పత్తిదారు సంస్థలు పలువురు సినీ సెలబ్రిటీలు తమ మధ్య ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని సోషల్ మీడియాలో బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఈ వాణిజ్య సంస్థల ప్రకటనల్లో నటిస్తూ లక్షల రూపాయల ఆదాయం అందుకుంటున్నారు.

ఐతే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మరియు సైడ్ హీరోయిన్ నటించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా బ్లెండర్స్ ప్రైడ్ మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేసింది. ఇందులో భాగంగా స్లీవ్ లెస్ దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ చేతిలో మందు గ్లాస్ తో కనిపిస్తూ ఫోటోలకి ఫోజులు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజనులు ఈ అమ్మడి ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మద్యపానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటే సినీ సెలబ్రిటీలు మాత్రం డబ్బు కోసం మద్యపానం చేయమని చెప్పడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే సినిమాల్లో యాక్ట్ చేయడం వల్ల వచ్చే వచ్చేటప్పుడు సరిపోకపోవడం వల్ల కొందరు సినీ సెలబ్రిటీలు ఇలా మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

ఈ విషయం మీద ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా నటి రెజీనా కసాండ్రా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న అప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో ఈ అమ్మడికి స్టార్డమ్ దక్కలేదు. దీంతో రెజీనా కసాండ్రా ప్రస్తుతం సరైన హిట్ కోసం బాగానే కష్టపడుతోంది. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు తమిళం మలయాళం తదితర భాషలలో కలిపి దాదాపుగా 5 చిత్రాలlo హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇందులో ఇప్పటికే తెలుగులో ఈ అమ్మడు నటిస్తున్న శాకిని ఢాకిని చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -