Rekha Boj: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపు పొందిన త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో తన హవా చూపుతోంది. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జంటగా నటించిన సంయుక్త మీనన్ ఆ సినిమా ద్వారా హిట్ అందుకొని మంచి గుర్తింపు పొందింది. ఇలా తెలుగు ప్రజలకు పరిచయమైన సంయుక్త మీనన్ తాజాగా ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రంలో ధనుష్ కి జంటగా నటించింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వటంతో తెలుగులో ఈ అమ్మడికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి.
ఇదిలా ఉండగా డైరెక్టర్ త్రివిక్రమ్, హీరోయిన్ సంయుక్త మీనన్ మధ్య రిలేషన్ కొనసాగుతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హారిక అండ్ హాసిని, సితార ఎంటెర్టైమెంట్స్ సంస్థలు హోం బ్యానర్స్ లాగా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ ఈ బ్యానర్స్ లో తప్ప ఇతర నిర్మాతలతో వర్క్ చేయడం లేదు. ఇదిలా ఉండగా సంయుక్త మీనన్ కి తెలుగులో అవకాశాలు రావటానికి త్రివిక్రమ్ కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి రిలేషన్ గురించి కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ వీరిద్దరి రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
Rekha Boj మాపై కొంచెం దయ చూపండి…
వైజాగ్ కి చెందిన యంగ్ బ్యూటీ తెలుగ రేఖా భోజ్ దామిని విల్లా, రంగేలా లాంటి చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉండగా రేఖా భోజ్ తాజాగా తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో ” చాలా కష్టపడుతున్నా గురూజీ.. ఆ మల్లు మీనన్ నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దయచూడండి” అంటూ త్రివిక్రమ్, సంయుక్త మీనన్ గురించి పోస్ట్ చేసింది. మల్లు మీనన్ ఎవరని నెటిజన్లు అడగగా.. రీసెంట్ టైంలో గురూజీ చల్లని చూపు పడిన మలయాళీ యాక్ట్రెస్ సంయుక్త మీనన్ అని తెలిపింది. రేఖా భోజ్ ఇలా త్రివిక్రమ్ గురించి గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.