Renu Desai: తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీనటి రేణు దేశాయ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జేమ్స్ పండు చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రేణు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది. ఇక నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఆ తర్వాత వచ్చిన జానీ సినిమాలో వీరిద్దరు మంచి సక్సెస్ అందుకున్నారు. అదే క్రమంలో అడపాదడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది రేణు దేశాయ్. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్, రేణు ల మధ్య ప్రేమ పుట్టగా ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని మనస్పర్థల వల్ల విడిపోయారు.
ఇక వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల కోసం ఒకరిపై ఒకరు గౌరవంగా ఉంటూ ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అయినా అకీరా, ఆద్య లతో కలిసి ఉంటుంది. ఇక రేణు సోషల్ మీడియాలో చాలా అరుదుగా ఉంటుంది. కుదిరినప్పుడల్లా తన ఇద్దరు పిల్లల గురించి అప్ డేట్స్ పంచుకుంటుంది.

Renu Desai: రేణుదేశాయ్ రెండో భర్త చేసే ఉద్యోగం ఇదే..
ఇదిలా ఉంటే రేణు దేశాయ్ రెండో భర్త గురించి బాగా చర్చలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే గతంలో రేణు దేశాయ్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన కాబోయే భర్త గురించి తెలిపింది. తను ఓ ఐటీ కంపెనీకి మేనేజర్ గా పని చేస్తున్నాడని.. ముందు అతడు అమెరికాలో ఉద్యోగం చేసే వాడని.. ఆ తర్వాత ఇండియాకు వచ్చి సెటిల్ అయ్యాడని తెలిపింది.
ఇక రెండో పెళ్లి గురించి చాలా రోజులపాటు ఆలోచన చేశాను అని.. పిల్లల కోసం ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఇక వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఏడాది కాగా.. ఇప్పటి వరకు అతని ఫోటో కానీ అతని గురించి కానీ క్లారిటీ ఇవ్వలేదు రేణు దేశాయ్. మరి వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనే ఆలోచనలు బాగా వస్తున్నాయి.