బుల్లితెర నటుడు అమర్ దీప్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అంతకు ముందు రెండు మూడు సీరియల్స్ లో చేసినప్పటికి జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అమర్ దీప్. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉండే అమర్ దీప్ ఎక్కువగా రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటాడు.
ఈ మధ్యనే ఈయన సహానటి అయినా కన్నడ నటి తేజస్విని గౌడ ని వివాహం చేసుకొని ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సందడి చేశారు. ఇక ఈ మధ్యనే ఆయన అర్ధరాత్రి రోడ్లపై జబర్దస్త్ నటి రీతూ చౌదరితో చేసిన రచ్చ మామూలుగా లేదు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. బాద్ షా సినిమాలోని బ్రహ్మానందం క్యారెక్టర్ ని చేసి కడుపుబ్బా నవ్వించాడు అమర్ దీప్.
అలాగే రీతూ చౌదరి దసరా సినిమాలో కీర్తి సురేష్ చేసిన బారాత్ డాన్స్ చేసి అలరించింది. వీళ్ళిద్దరూ కలిసి మరొక తమిళ్ సాంగ్ కి కూడా డాన్స్ చేశారు. అమరదీప్ యాక్టింగ్ సూపర్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. ఇదే వీడియోలో మరికొంతమంది బుల్లితెర నటులు కూడా కనిపించి సందడి చేశారు. ఇక వీరిద్దరూ కలిసి రీల్ చేయటంతో ఏదైనా వెబ్ సిరీస్ కి ప్లాన్ చేస్తున్నారేమో, అందుకే ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తున్నారేమో అంటూ సందేహ పడుతున్నారు నెటిజన్స్.
Ritu Chowdhary and Amar Deep
అయితే కేవలం బ్రహ్మానందం రీల్ పై మాత్రమే అమర్ కామెంట్స్ ఆన్ చేశారు మిగిలిన రెండు రీల్స్ కి కామెంట్స్ ఆన్ చేయలేదు. ఈమధ్య రీతూ చౌదరి ఏది షేర్ చేసిన నెగిటివ్ కామెంట్స్ రావడం, అందులోనూ కొన్ని అభ్యంతరకరంగా ఉండటంతో ఆ విధంగా చేసినట్లు తెలుస్తుంది. కానీ అమర్ దీప్ యాక్టింగ్ ఇరగదీసేసాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్.