Rocking Rakesh: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది జంటలుగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన వారు కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే జంటలుగా సందడి చేస్తున్నారు. కానీ జబర్దస్త్ ద్వారా మారిన సుజాత రాకింగ్ రాకేష్ మాత్రం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ప్రేమించుకుని ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మొదట వీరి ప్రేమ కూడా కేవలం జబర్దస్త్ స్కిట్ల కోసం మాత్రమే అని అందరూ భావించారు. కానీ వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వీరిది నిజమైన ప్రేమ అని అందరికీ అర్థం అయింది.
ఇక ఇటీవల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సన్నిహితుల మధ్య వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత కూడా వీరిద్దరూ జబర్దస్త్ లో కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా వివాహం జరిగి కొంతకాలం కూడా గడవకముందే సుజాత గురించి రాకేష్ షాకింగ్ విషయాలు బయట పెట్టాడు. ప్రేమించే దాకా సుజాత తనని టార్చర్ పెట్టిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాకింగ్ రాకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే జబర్దస్త్ స్కిట్ లో భాగంగా రాకేష్ సుజాత గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
Rocking Rakesh: ప్రేమించేదాకా టార్చర్ చేసింది…
`ఎక్స్ ట్రా జబర్దస్త్` స్కిట్‌లో భాగంగా రాకేష్ ఒక స్కిట్ చేశాడు. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సీన్ కాన్సెప్ట్ తీసుకొని నిజం చెబితే కాయ చెట్టుపైకి వెళ్తుందని, అబద్దం చెబితే కదలదనే కాన్సెప్ట్ తో స్కిట్ చేశారు . ఈ స్కిట్ లో భాగంగా మొదట తమది నిజమైన ప్రేమ అని, గాఢమైన ప్రేమ అని రాకేష్ చెబితే కాయ కదల్లేదు. కానీ ప్రేమించమని, పెళ్లి చేసుకోమని సుజాత తనని టార్చర్ చేసిందని రాకేష్ చెప్పడంతో కాయ పైకి వెళ్లింది. దీంతో సెట్ మొత్తం నవ్వులు పూయించగా, సుజాత మాత్రం రాకేష్ చేసిన పనికి నోరెళ్లబెట్టింది.