RP Patnaik: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన ఆర్పి పట్నాయక్ గురించి తెలియని వారంటూ ఉండరు. మనసంతా నువ్వే, నిజం, జయం, సంతోషం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఆర్పి పట్నాయక్ ప్రస్తుతం సంగీతానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించి పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. 2016 వరకు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో సంగీతానికి దూరం అయ్యాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పి పట్నాయక్ మహేష్ బాబు సినిమాకి పాటలు పాడి తప్పు చేశానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ… తన జీవితంలో తప్పు చేశానని బాధపడిన సందర్భాలు చాలా తక్కువ అని తెలిపాడు. కేవలం మహేశ్ బాబు సినిమాకు పాటలు పాడినందకు మాత్రం ఎందుకు పాడానా అని బాధ పడ్డానన్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాకి ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ సినిమాకు సంగీతం అందించటమే కాకుండా ఆ సినిమాలోని కొన్ని పాటలు కూడా ఆర్పి పట్నాయక్ పాడాడు. ఈ క్రమంలో ఇన్నేళ్ల తన కెరీర్లో నిజం సినిమా విషయంలో మాత్రం తాను రిగ్రెట్ ఫీలవుతానని ఆర్పీ పట్నాయక్ చెప్పారు.
RP Patnaik మహేష్ బాబుకు నా గొంతు సెట్ అవ్వలేదు…
నిజం సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తాను ఎక్కువ భాగం పాటలను పాడానని ఆర్పి తెలిపాడు. అయితే మహేష్‌కు తన వాయిస్ అస్సలు సెట్ కాలేదని.. ఆ సినిమాలు మహేష్ బాబు పిల్లాడిలా నటించాడని, మహేష్ బాబు పాత్రకు తన గొంతు సరిపోలేదని తెలిపాడు. అందుకే తాను ఈ సినిమాకు పాటలు పాడాల్సింది కాదు అని బాధపడినట్లు ఆర్పి పట్నాయక్ తెలిపాడు. అంతే కాకుండా ఆ సినిమా టైమ్‌లో చాలామంది ఫోన్ చేసి ఇదే విషయాన్ని తనకు చెప్పారని, పాడే ఛాన్స్ వచ్చిందని ఎలా పడితే అలా పాడేస్తావా అంటూ.. ముఖం మీదే అడిగేవారని ఆర్పీ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.