RRR Movie: ఆర్ఆర్ ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందిగా…. ఎప్పుడంటే?

Akashavani

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ దాటి రికార్డులు సృష్టించిందని చెప్పాలి.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో సందడి చేశారు.

ఈ విధంగా థియేటర్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరలకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మే 20వ తేదీ జీ 5 యాప్ లో విడుదల కానుంది.అయితే ఈ సినిమా జూన్ మొదటివారంలో విడుదల అవుతుందని భావించినప్పటికీ 10 రోజులు ముందుగానే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

 

RRR Movie: పే ఫర్ వ్యూ పద్ధతిలో….

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా హిందీలో మే 20 తేదీ కాకుండా మరికొన్ని రోజులు ఆలస్యం విడుదల చేయనున్నట్లు జీ 5 అధికారికంగా ప్రకటించారు. అయితే గతంలో ఈ సినిమాని ఓటీటీలో పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాని విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి స్పష్టత తెలియలేదు. మరి ఈ సినిమాని ఓటీటీలో పే ఫర్ వ్యూ పద్ధతిలో చూడాల లేదంటే సాధారణంగా చూసే అవకాశం కల్పిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

- Advertisement -