RRR Movie: ఆర్ఆర్ఆర్ లో పవర్ స్టార్ కు అలా అవకాశం మిస్ అయ్యిందా?

Akashavani

RRR Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాతో అప్పటి యువతను ఒక రేంజ్ లో ఆట్టుకున్నాడు.

ఇక తక్కువ సినిమాలో నటించినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరో లెవెల్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక పవర్ స్టార్ అభిమానుల గురించి మనందరికీ తెలుసు. పవన్ ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమా లో ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం థియేటర్లలో హడావిడి చేస్తున్న రాజమౌళి చిత్రం త్రిబుల్ ఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజే మరో స్థాయిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజం బయట పెట్టాడు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ లో పవర్ స్టార్ కు అలా అవకాశం మిస్ అయ్యిందా?
RRR Movie: ఆర్ఆర్ఆర్ లో పవర్ స్టార్ కు అలా అవకాశం మిస్ అయ్యిందా?

RRR Movie: త్రిబుల్ ఆర్ సినిమాలో పవర్ స్టార్ కు అలా ఛాన్స్ అని చెప్పడానికి కారణం ఇదే!

త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక హీరోకు పవన్ కళ్యాణ్ పేరును పెట్టాలి అని రాజమౌళి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రేక్షకులకు ఇష్ట పరంగా సినిమాలో పాత్రలు పేర్లు పట్టుకోగలిగితే త్రిబుల్ ఆర్ సినిమాలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగేదని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

ఇక పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల విషయానికొస్తే.. హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా pspk 29 అనే ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరో సినిమా వచ్చేసి భవదీయుడు భగత్ సింగ్ కాగా ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -