RRR Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి జక్కన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ఘనత జక్కన్నకే చెల్లుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన దర్శకత్వంలో వచ్చిన RRRసినిమాలోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ రావడం కోసం రాజమౌళి పడినటువంటి కృషి అందరికీ తెలిసిందే.చిత్ర బృందం అమెరికాలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు ఎలాగైనా అందుకోవాలని కసితో ఎన్టీఆర్ రామ్ చరణ్ వారి తదుపరి సినిమా ప్రాజెక్టులను కూడా పక్కనపెట్టి ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఇలా వీరి తదుపరి సినిమాలను పక్కన పెట్టడంతో ఈ హీరోలు భారీగా నష్టపోయారని చెప్పాలి.
RRR Movie: కోట్ల రూపాయలు నష్టపోయిన చరణ్ తారక్…
ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇద్దరి హీరోలు రెమ్యూనరేషన్ 100 కోట్ల వరకు ఉంటుంది. ఇలా ఈ హీరోలు సినిమాలను పక్కనపెట్టి ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం ముందుకు వచ్చారు. ఇలాఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వారి ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో ఒక్కొక్కరు సుమారు 60 నుంచి 70 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని ఇండస్ట్రీ సమాచారం. ఏది ఏమైనా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో వీరి క్రేజ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయిందని చెప్పాలి. ఈ క్రమంలోనే వీరికి హాలీవుడ్ అవకాశాలు కూడా రావడం విశేషం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలో శివ సినిమాతో బిజీ కానున్నారు, రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీ అయ్యారు.