RRR Movie: ఆ ఇద్దరుల సినిమాకన్నా తక్కువ కలెక్షన్స్.. ఆర్ఆర్ఆర్ కు ఊహించని షాక్!

Akashavani

RRR Movie: టాలీవుడ్ ప్రేక్షకులకు త్రిబుల్ ఆర్ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రాణం పోసిన ఈ సినిమాను స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మెయిన్ రోల్స్ చేశారు.

ఇక కరోనా మహమ్మారి కారణంగా మొన్నటి వరకు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ను మార్చి 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. ఇక విడుదలైన మొదటిరోజే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక స్టార్ హీరోలు ఇద్దరు రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ లు గా మారిపోయారు. బీ టౌన్ ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఫిదా చేసింది.

ఇక కలెక్షన్ల రూపంలో మరో లెవెల్ లో దూసుకుపోతుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద దాదాపు ఏడువందల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వీక్ లో అత్యధిక వసూళ్లు సాధించిన పాన్ ఇండియా చిత్రం గా ఓ వెలుగు వెలిగింది. ఇక మొదటి ఆరు రోజులు వసూళ్ల విషయంలో రామబాణంలా దూసుకుపోయిన ఈ సినిమా ఏడవ రోజు మాత్రం కొంతవరకు డీలా పడింది అని చెప్పవచ్చు.

RRR Movie: ఆ ఇద్దరుల సినిమాకన్నా తక్కువ కలెక్షన్స్.. ఆర్ఆర్ఆర్ కు ఊహించని షాక్!
RRR Movie: ఆ ఇద్దరుల సినిమాకన్నా తక్కువ కలెక్షన్స్.. ఆర్ఆర్ఆర్ కు ఊహించని షాక్!

RRR Movie: త్రిబుల్ ఆర్ సినిమా ఈ రెండు సినిమాల కంటే తక్కువ కలెక్షన్లు సాధించింది!

ఏడో రోజు మాత్రం అల్లు అర్జున్, మహేష్ బాబు ల సినిమాల కంటే తక్కువ లెవెల్లో కలెక్షన్లు అందుకోవడం ప్రజలందరికీ ఆశ్చర్య కరంగా మారింది. ఇక ఏడోవ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా ఉంది. ఆతర్వాత బాహుబలి టు రెండవ స్థానం లో ఉంది.

మరీ ఏడో రోజు ఇంత దారుణంగా డీలా పడిన త్రిబుల్ ఆర్ సినిమా రాబోయే రోజుల్లో మరింత డీలా పడుతుందా లేక మరి కొంచెం ఊపు అందుకుంటుందో చూడాలి.

- Advertisement -