RRR Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకరు. యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించిన రాహుల్ ఆ తర్వాత సినిమాలలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకొని సింగర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు ఎన్నో అవార్డులు వరించాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే.

RRR Movie: నాటు… నాటు లైవ్ ఫర్ఫార్మన్స్

మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఆస్కార్ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అతిరథ మహారాజుల ముందు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవల నాటు నాటు లైవ్ ఫర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. గతంలో ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్ వరిస్తుందని ఆర్ఆర్ఆర్ టీమ్ గట్టి విశ్వాసంతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి స్వరపరచగా… రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు నామినేషన్స్ ఈవెంట్ లో కూడా రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట పాడబోతున్నాడు. దీంతో రాహూల్ సిప్లిగంజ్ రేంజ్ ఆస్కార్ వరకు వెళ్ళిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...