RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను పక్కన పెట్టి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో స్వాతంత్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్నేహ బంధం గురించి అద్భుతంగా వివరించారు.
రాజమౌళి ఈ సినిమా ద్వారా చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఇక ఈ సినిమా దేశ విదేశాలలో కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి.ఇకపోతే హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే కొందరు మాత్రం ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్నేహ బంధాన్ని గే అంటూ భారీగా ఈ సినిమా గురించి ట్రోల్ చేస్తున్నారు.

RRR Movie: మీ మానసిక స్థితికి నిదర్శనం…
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్నో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని చెప్పారు నిజమే, అడ్వెంచర్ మూవీ అన్నారు నిజమే, కానీ ఈ సినిమా గే సినిమా అని ఎవరూ చెప్పలేదు ఏంటి అంటూ వెటకారంగా ఈ సినిమాపై కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి చేస్తున్న కామెంట్లపై తెలుగు సినీ ప్రేమికులు స్పందిస్తూ భారీగా రీ కౌంటర్ ఇస్తున్నారు. మీరు ఎప్పటికీ మారరు, మీకు అసలు స్నేహం, బ్రోమాన్స్ గురించి తెలియదు. అందుకే ఇద్దరు పురుషుల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ఇలా గే అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు.ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో వెస్ట్రన్ ఆడియన్స్ ఈ సినిమా విజయాన్ని ఓర్వలేకపోతున్నారు. ఇది వారి మానసిక పరిస్థితికి నిదర్శనం అంటూ భారీ స్థాయిలో కౌంటర్ వేస్తున్నారు.