S.V. Krishna Reddy: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, స్వరకర్త అయిన ఎస్వీ కృష్ణారెడ్డి అంటే తెలియని వారుండరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
కొబ్బరి బొండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు నంబర్ వన్, యమలీల,శుభలగ్నం, ఘటోత్కచుడు వజ్రం, సంప్రదాయం, మావిచిగురు, వినోదం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రధానంగా తెలుగు సినిమాలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు .
అతను మలయాళం, హిందీ భాషా చిత్రాలలో కూడా పనిచేశాడు. మొదటిగా కొబ్బరి బొండం సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యాడు. 2012లో అతను రొమాంటిక్ కామెడీ డైవోర్స్ ఇన్విటేషన్ అనే అమెరికన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
మొదటిగా కిరాతకుడు సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. చెప్పాలంటే ఎస్ వి కృష్ణారెడ్డి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి పరిచాడు ఆ ప్రయత్నాలలో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు. కానీ విఫలమయ్యారు.
అందుకోసం కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి కలిసి ఓ స్వీట్ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. అలాగే అందులో వచ్చిన డబ్బులతో ఇంకో టీ పొడి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో వీరు అమ్మే టీ పొడి మంచి ప్రాధాన్యత కలిగి ఉండేది.
S.V. Krishna Reddy : హీరో అవ్వాలని దర్శకుడిగా మారిన దర్శకుడు..
అలా హీరోగా నటించాల్సిన కృష్ణారెడ్డి చిన్నచిన్న వ్యాపారాలు చేసి ఆ డబ్బులతో మొదటిగా రాజేంద్రప్రసాద్ ను పెట్టి తీసిన కొబ్బరి బొండం సినిమాకు నిర్మాతగా వహించారు. ఆ తర్వాత మొట్ట మొదటిసారిగా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఇలా హీరో అవ్వాలనుకున్న కృష్ణారెడ్డి కల కలగానే మిగిలిపోయింది. కానీ మంచి దర్శకుడిగా, నిర్మాతగా రచయితగా, గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు.