Sadha: సదా.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సదా ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన సదా.. ఇప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ పేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా సదా పెళ్లి గురించి తరచూ అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
3పదుల వయసు దాటినా కూడా సదా ఇంకా వివాహం చేసుకోకపోవటంతో తరచూ ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా ఈ వార్తలపై సదా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో..” పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రీడం ఉండదు. అందుకే నేను పెళ్లి చేసుకోను. మనల్ని అర్థం చేసుకుని.. మనకి ఫ్రీడమ్ ఇచ్చే వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు .. ఆ లైఫ్ బాగుంటుంది.. అయినా ఇటీవల కొంతమంది గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకొని విడిపోతున్న సంఘటన చూస్తూనే ఉన్నాం ..అలా విడిపోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే చాలా బెటర్ ” అంటు షాకింగ్ కామెంట్స్ చేసింది.
Sadha: కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసుకుని విడిపోతున్నారు….
దీంతో సదా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సదా కొందరు సెలబ్రిటీలను ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వివాహం జరిగిన కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో మెగా వారసురాళ్లు నిహారిక, శ్రీజ తో పాటు సమంతా కూడా వివాహమైన కొంతకాలానికే విడాకులు తీసుకుంది. అందువల్ల ప్రస్తుతం వారిని ఉద్దేశించే సదా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.