Sadha తెలుగులో డజనుకు పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి సదా మొదటగా యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన జయం అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించింది. చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉండటంతో నటి సదా కి టాలీవుడ్, కోలీవుడ్ అలాగే బాలీవుడ్ లో కూడా సినిమా ఆఫర్లు బాగానే వరించాయి. దీంతో కొంత కాలం పాటు సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడిపింది. కానీ ఏమైందో ఏమోగాని డజనుకు పైగా చిత్రాలలో నటించిన తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించేసింది. దీనికి తోడు ఈమధ్య నటి సదా నటించిన చిత్రాలు కొంతమేర బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
అయితే ఈ మధ్య కాలంలో నటి సదా సినిమాల్లో పెద్దగా నటించే లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ మతి పోగొడుతోంది. అయితే తాజాగా సాంప్రదాయ దుస్తులు ధరించి సిగ్గుపడుతూ కన్నానులే కలయికలు అనే పాట తమిళ వెర్షన్ కి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ రీల్ చేసింది.

అలాగే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు సదా అందానికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా 40 ఏళ్ల వయసు దాటినప్పటికీ అందం ఏ మాత్రం తగ్గలేదని అలాగే ఇప్పుడు కూడా హీరోయిన్గా అవకాశాలు కోసం ప్రయత్నిస్తే కచ్చితంగా వర్తిస్తాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం హీరోయిన్ సదా కి వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరుగుతోందని కొంటెగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి సదా ఒకప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బాగానే రాణించినప్పటికీ క్రమక్రమంగా కథల విషయంలో శ్రద్ధ లోపించడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. ఈ క్రమంలో తన వైవాహిక జీవితంపై దృష్టిసారించి బాగానే సెట్ అయినప్పటికీ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గతంలో నటి సదా టార్చ్ లైట్ అనే చిత్రంలో వేశ్య పాత్రలో నటించి బాగానే లభించింది ఈ చిత్రం తమిళంలో హిట్ అయ్యి మంచి కలెక్షన్లు సాధించింది.
Image Source : https://www.instagram.com/p/Cdn1aXVIWKt/