Sagar K Chandra: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసిన వారెవరైనా ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ అందుకున్నవారున్నారు. తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి దర్శకుడిగా మారిన కరుణకరన్ ఆ తర్వాత టాలీవుడ్‌లో మంచి దర్శకుడిగా సెటిలయ్యారు. బద్రి సినిమాతో పూరి జగన్నాథ్‌ను టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం చేశారు పవన్. ఆయన ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే, కొందరు దర్శకులు ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత ఫేడౌట్ అయ్యారు కూడా.
అలా, భీమ్లా నాయక్ డైరెక్టర్ మిగులుతాడా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాతో టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సాగర్ కె చంద్ర. అయితే, అనూహ్యంగా పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని మాత్రం ఎప్పుడూ ఊహించి ఉండడు. మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియుంకు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించాడు సాగర్. ఇందులో రానా మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
Sagar K Chandra: చేతిలో ఒక్క అవకాశం కూడా లేకపోవడమే..
మేకింగ్ పరంగా సాగర్ కె చంద్రకు మంచి పేరే వచ్చింది. కానీ, ఈ సినిమాకు తెలుగులో స్క్రిప్ట్ అందించింది మాత్రం పవన్ అత్యంత సన్నిహుతుడు – దర్శక, రచయిత త్రివిక్రం శ్రీనివాస్. అందుకే, ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ఎలాంటి క్రెడిట్ అయినా కూడా త్రివిక్రంకే వెళ్ళిపోయింది. దర్శకుడిగా భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ దక్కించుకున్న క్రేజ్ ఏమీ లేదనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాను తీసి హిట్ అందుకున్నా ఇప్పటివరకు చేతిలో ఒక్క అవకాశం కూడా లేకపోవడమే అంటున్నారు.