Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.బైక్ పై వెళుతున్నటువంటి సాయి ధరమ్ తేజ్ ఉన్నఫలంగా అదుపుతప్పి పడిపోయారు. దీంతో తీవ్ర గాయాలు పాలైన అతడిని సమీపంలోనే ఉన్నటువంటి సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి చూసి తనని వెంటనే హాస్పిటల్ కి పంపించే ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడంతో నేడు సాయిధరమ్ తేజ్ మన ముందు ప్రాణాలతో ఉన్నారని చెప్పాలి.
ఇలా ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ప్రమాదం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిన తర్వాత తనని కాపాడిన సయ్యద్ అబ్దుల్ గురించి కూడా సాయి ధరమ్ తేజ్ తెలిపారు.మిమ్మల్ని కాపాడిన వ్యక్తికి మీరేమిచ్చారనే ప్రశ్న ఎదురవుగా ఆయన పలు సమాధానాలు చెప్పారు. నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అందుకు కారణం సయ్యద్ అని తెలిపారు.
Sai Dharam Tej: మద్యం తాగే అలవాటు లేదు…
ఇలా తనని ప్రాణాలతో కాపాడిన వ్యక్తికి తాను డబ్బులు ఇచ్చి థాంక్స్ చెప్పి పంపించలేను అందుకే నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా అడగమని చెప్పాను. ఆయనకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో మానవత్వాన్ని ముడి పెట్టలేను. తనకు సహాయం చేయడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని సాయి ధరంతేజ్ తెలియచేశారు.ఇక తన కుటుంబం తనకు ఇచ్చారా లేదా అనే విషయం తనకు తెలియదని తాను మాత్రం తనకు సహాయం చేయడానికి ముందు ఉంటానని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మద్యం తాగి డ్రైవ్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన సాయి తేజ్ తనకు మద్యం తాగే అలవాటు లేదని తెలిపారు. అలాగే తాను ఆరోజు డైరెక్టర్ దేవకట్ట ఇంటికి వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇలా సాయి ధరమ్ తేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.