Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఐటీవల విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ఈ మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో సాయి ధరమ్ తేజ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి మామ అల్లుళ్లు ఇద్దరు బ్రో సినిమా ద్వారా ప్రేక్షకులం ముందుకి రాబోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వివిధ దేవాలయాలను దర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తిరుపతిలోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించి శ్రీవారి దర్శనం చేసుకున్నాడు.
అలాగే తాజాగా ప్రఖ్యాత కడప అమీన్ పీర్ దర్గా ను కూడా ధరమ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మీడియా తో మాట్లాడుతూ.. “కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ..పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం నాకు పునర్జన్మ. అందువల్ల దేవుడు మళ్లీ నాకు పునర్జన్మను అందివ్వడంతో ఆలయాలను సందర్శిస్తూ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. ఇక ప్రస్తుతం మామయ్యతో కలిసి బ్రో సినిమాలో నటించటం మరువలేని అనుభూతి, ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తెలిపాడు.
Sai Dharam Tej: సినిమా రంగం అంటేనే ఇష్టం….
ఇక ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తల గురించి కూడా సాయిధరమ్ తేజ్ స్పందించాడు . పవన్ మామయ్య జనసేన పార్టీలోకి వస్తారా అని నన్ను అడుగుతున్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారు.. కానీ నాకు రాజకీయాలపై అవగాహన లేదు. నేను సినీ రంగంలోనే ఉంటా అని చెప్పాను. మామయ్య అదే చెప్పారు.” అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మామ అల్లుళ్లు కలిసి నటించిన బ్రో సినిమా జులై 28వ తేదీ ప్రేక్షకులం ముందుకి రాబోతోంది. ఈ సినిమాతో మామ అల్లుళ్ళిద్దరూ హిట్ కొడతారా? లేదా? చూడాలి మరి.