Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరంతేజ్ సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో సినిమా గురించి ,తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ అనారోగ్యం నుండి కోలుకొని విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..” విరూపాక్ష అంటే శివుడి మూడో కన్ను అని అర్థమని.. రూపం లేనిదేదో ఈ సినిమాలో ఉంటుందని.. దానిపై పోరాటం ప్రధానంగా సాగే ఈ కథకు విరూపాక్ష అనే పేరు పెట్టినట్లుగా తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వెల్లడించాడు.
Sai Dharam Tej ఆ మాటలు చాలా ఇన్ స్పైర్ చేశాయి…
ఆ తర్వాత ” ప్రస్తుతం తన జీవితంలో అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయని, అవి లేకపోతే జీవితం చప్పగా ఉంటుందని తెలిపాడు. అందుకే జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ సినిమాలు చేస్తానో లేదో అని అందరూ అనుకున్నారు. అయితే ‘ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ‘ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలోని లైన్స్ చిరంజీవి మామయ్య పంపించి నన్ను ప్రోత్సహించారు అంటూ చెప్పుకొచ్చాడు.