Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరంతేజ్ ఇటీవల విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సుప్రీం, పిల్ల నువ్వు లేని జీవితం అంటే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సాయి ధరమ్ తేజ్ కొంతకాలం క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా హిట్ అయినా కూడా సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్, డాన్స్ గురించి ప్రేక్షకులు కొంత వరకు నిరాశ చెందారు. మెగా హీరోలంటే డాన్స్ కి కేరాఫ్ అడ్రస్.
ప్రమాదానికి ముందు సాయి ధరమ్ తేజ్ కూడా డాన్స్ అదరగొట్టేసాడు. కానీ విరూపాక్షతో పాటు ఇటీవల బ్రో సినిమా నుండి విడుదలైన పాటలలో సాయిధరమ్ తేజ్ లో మునుపటి డ్యాన్స్ మూమెంట్స్, ఆ హుషారు కనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ కామెంట్స్ పై తేజు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు. ” బైక్ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ట్రీట్మెంట్, మెడిసిన్స్ వల్ల బాడీలో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని తేజు తెలిపాడు. అంతే కాకుండా ఇప్పుడు నా డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు నేను కూడా నిరాశ పడ్డాను అని తెలిపాడు.
Sai Dharam Tej: స్టెరాయిడ్స్ కారణం…
యాక్సిడెంట్ తర్వాత కనీసం మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు దానిని అధిగమించాను. అసలు ప్రాబ్లం యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్ల కాదు. కోమాలో ఉన్నప్పుడు ఇచ్చిన స్టెరాయిడ్స్ . ఆ స్టెరాయిడ్స్ నా బాడీపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ఫిజికల్ ఫిట్ నెస్ కోల్పోయాను. తిరిగి ఫిట్ నెస్ గైన్ చేయాలి. ప్రస్తుతం దానికోసమే కష్టపడుతున్నా. తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి మునుపటికంటే బాగా డ్యాన్స్ చేస్తా. ఇది నా ప్రామిస్ అని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక బ్రో సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు.