Sai Dharam Tej: మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు.ఇలా మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఈయన పెద్దగా బయట కార్యక్రమాలకు సినిమా ఈవెంట్ లకు హాజరు కాలేదు.ఈ క్రమంలోనే ఇంటిపట్టునే ఉంటూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నటువంటి సాయి తేజ్ తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు.
కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ధరం తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సాయి తేజ్ మాట్లాడుతూ సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Sai Dharam Tej: ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి…
కిరణ్ అబ్బవరం తనను ఇదివరకు ఎన్నో సార్లు తన సినిమా వేడుకలకు తనని ఆహ్వానించారని అయితే తనకు వీలు కాలేకపోయిందని తెలిపారు. ఇలా సాయి ధరం తేజ్ మాట్లాడుతూ ఉండగా… ఓ అభిమాని అన్న మీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రియాక్ట్ అయినటువంటి సాయి ధరమ్ తేజ్ సమాధానం చెబుతూ…మీరు ఎప్పుడైతే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారో అప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఇది మీ వల్ల అవుతుందా అంటూ కామెంట్ చేశారు. ముందు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ ఈయన అభిమానులకు చిన్నపాటి క్లాస్ పీకారు.తన పెళ్లి విషయానికి వస్తే ఇప్పటికే తనకు సోషల్ మీడియాలో నాలుగు సార్లు పెళ్లి చేశారని సాయిధరమ్ తేజ్ ఈ సందర్భంగా పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.