Sai Dharam Tej: మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న సాయి ధరమ్ తేజ్ కొంతకాలం క్రితం బైక్ ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ చాలా కాలం చికిత్స తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారాడు.
ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ సినిమా విశేషాల గురించి అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ సినిమా విశేషాలతో పాటు తనకి జరిగిన ప్రమాదం గురించి కూడా అభిమానులతో పంచుకున్నాడు.
Sai Dharam Tej: నాకు నోట మాట రాలేదు…
ఈ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..’ ఊహించని ప్రమాదానికి గురై అందరినీ టెన్షన్ పెట్టాను. అందుకు మీ అందరికీ నా క్షమాపణలు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటిసారిగా స్పృహ లోకి వచ్చాక అమ్మని తమ్ముని చూశాను. వారికి సారీ చెప్పాలని ప్రయత్నించాను. అయితే నాకు మాట రాలేదు. అప్పుడే నాకు గొంతు పోయిందని అర్థమయ్యింది. బాధ మనిషిని ఎంతగా మార్చగలదో అప్పుడే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలో మీ తల్లిదండ్రులు గురువులు గర్వపడేలా చేయండి దయచేసి ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి అంటూ సాయిధరమ్ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.